NTV Telugu Site icon

ICC Awards: ఐసీసీ వన్డే, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే?

Stokesy12

Stokesy12

గతేడాది అద్భుత ప్రదర్శనతో మెప్పించిన మేటి ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్, ఎమర్జింగ్ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా రేణుకా సింగ్‌ పేర్లను ప్రకటించింది ఐసీసీ. తాజాగా గురువారం వన్డే, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని వెల్లడించింది. కాగా, 2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌కు దక్కింది. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్‌ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బాబర్‌ వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్‌ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్‌ షై హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్‌ తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్‌ రికార్డు క్రియేట్ చేశాడు. మహిళల విభాగంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలియా సీవర్‌ విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

Oneplus Event: వన్‌ ప్లస్ లాంచ్ ఈవెంట్‌ వచ్చేస్తోంది.. సరికొత్త ఫోన్లు, ప్రొడక్ట్స్‌తో!

కాగా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కైవసం చేసుకున్నాడు. నిరుడు ఈ ఫార్మాట్లో 36.25 సగటుతో 870 రన్స్ చేసిన స్టోక్స్.. 26 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ టెస్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి 10 టెస్టుల్లో 9 విజయాలు అందించాడు. ఇకపోతే, ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇతడికి ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్‌ విజేతగా నిలిచాడు. సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్‌ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్‌.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు.

ఐసీసీ అవార్డులు-2022

మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – సూర్యకుమార్ (భారత్)
విమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – మార్కో జాన్సెస్ (సౌతాఫ్రికా)
విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – రేణుకా సింగ్ (భారత్)
మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – బాబర్ అజామ్ (పాకిస్తాన్)
విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – నటాలియా సీవర్ (ఇంగ్లాండ్)
మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)
అంపైర్ ఆఫ్ ది ఇయర్ – రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్)