యూఏఈ వేదికగా బీసీసీఐ ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచ కప్ లో విజయం సాధించిన జట్టుకు మొత్తం 1.6 మిలియన్ డాలర్స్ ఇవ్వనుంది ఐసీసీ. అంటే అక్షరాల 12,02,10,400 రూపాయలు. ఇక ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచినా జట్టుకు 8 లక్షల డాలర్స్ అందనున్నాయి. అలాగే సెమిస్ కు చేరుకున్న జట్లకు 4 లక్షల డాలర్లు ఇవ్వనున్న ఐసీసీ ఈ మెగా టోర్నీ కోసం మొత్తం 5.6 మిలియన్ డాలర్స్ ను ఖర్చు చేయనుంది. ఇక ఈ నెల 17 న ఈ ప్రపంచ కప్ ఆరంభం కానుంది. అందులో మొదట క్వాలిఫైర్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఇప్పటికే ఈ టోర్నీకి అర్హత సాధించిన జట్లు వార్మప్ మ్యాచ్ లలో పాల్గొంటాయి. ఆ తర్వాత ఈ నెల 23న మొదటి మ్యాచ్ ఈ టోర్నీలో జరుగుతుండగా… 24న మన టీం ఇండియా పాకిస్త జట్టును ఎదుర్కోనుంది.
టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ…
