Site icon NTV Telugu

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు. 20/20 క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. శ్రీధర్, రామాంజనేయులు, రాము గౌడ్, ఛత్రపతి, కళ్యాణ్ ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు. క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్స్ ఛేంజ్ అనే యాప్ ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. దీని పై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ… క్రికెట్ మ్యాచ్ ల స్కోర్ అప్ డేట్స్ చూపించే యాప్ ల సమాచారం ఆధారంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ల కోసం వివిధ రకాల యాప్ లను ఉపయోగించుకుంటున్నారు ముఠా సభ్యులు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము. క్రికెట్ బెట్టింగ్ లకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాలి. వారి దగ్గరి నుండి 14 లక్షల 92 వేల నగదు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version