Site icon NTV Telugu

రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం…

రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ పై వచ్చిన ఆరోపణల పై ఈ నెల 15న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ నోటీసులకు సమాధానం ఇవ్వని అజార్ పైగా తానే ప్రసిడెంట్ అని కౌంటర్ వేసాడు. దీంతో ఈ నెల 26న హెచ్ సిఏ తాత్కాలిక అధ్యక్షుడుగా జాన్ మనోజ్ ను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

ఇక వచ్చే నెల 18న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న జనరల్ బాడీ మీటింగ్ లో 1/3 మెజారిటీ ఆమోదంతో అజార్ పై వేటు వేసేందుకు అపెక్స్ కౌన్సిల్ సిద్దం అయ్యింది. జనరల్ బాడీలో అజార్ పై వచ్చిన ఫిర్యాదుల పై విచారణ జరిపి పక్కాగా టెక్నికల్ ఆధారాలను సేకరించిన హెచ్ సిఏ సభ్యులు అజార్ ను బయటకు సాగనంపేందుకు రంగం సిద్దం చేసారు. ఇక వచ్చే నెల 18న జనరల్ బాడీ సమావేశంకి హాజరు కావాలని అజార్ కు సందేశం పంపింది అపెక్స్ కౌన్సిల్..

Exit mobile version