NTV Telugu Site icon

WTC 2023 Final: భారత్ ఫైనల్‌కు చేరాలంటే.. అది తప్పకుండా జరిగి తీరాలి

Wtc Finals India

Wtc Finals India

Huge Chances For Team India To Reach World Test Championship Final: ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో.. భారత్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. కానీ.. భారత్ పరిస్థితే ఇంకా అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో భారత్ 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. కానీ, ఫైనల్స్‌లో అర్హత కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే.. పరిస్థితులు దాదాపు భారత్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, కనీసం డ్రాగా ముగిసినా.. ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధిస్తుంది. కానీ, ఓడిపోతేనే ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత జట్టు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రత పై సస్పెన్స్.. పిటీషన్ పై విచారణ వాయిదా

అదెలా అంటే..?
ఈ నెలలో మార్చి 9వ తేదీన శ్రీలంక, న్యూజీలాండ్ జట్టు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌ను వెనక్కు నెట్టేసి, శ్రీలంక ఫైనల్స్‌కి చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా, డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్స్ అవకాశం కోల్పోయినట్టే! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ లెక్కన.. శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తేనే, ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందన్నమాట! అయితే.. న్యూజీలాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది కాబట్టి, శ్రీలంకకు క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే! కాబట్టి.. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Lionell Messi: నీ కోసమే వెయిటింగ్.. మెస్సీకి బెదిరింపు లేఖ

ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచెస్‌లో భారత్ గెలుపొందగా, మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో.. 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఓవైపు నాలుగో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్‌ నెగ్గాలని చూస్తుంటే, మరోవైపు నాలుగో టెస్టులోనూ సత్తా చాటి ఈ సిరీస్‌ని డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా చూస్తోంది. మరి, ఈ నాలుగో మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.