NTV Telugu Site icon

టోక్యో పారాలింపిక్స్.. భారత్‌కు మరో పతకం

టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.