Site icon NTV Telugu

Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!

Shami

Shami

Mohammed Shami: టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఇస్తున్న భరణం​ సరిపోవట్లేదని అతడి మాజీ భార్య హసిన్ జహాన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హసీన్‌ పిటీషన్‌ను విచారించిన కోర్టు షమీకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని తెలిపింది. కోల్‌కాతా హైకోర్టు ఆదేశాల మేరకు హసీన్‌కు రూ. 4 లక్షలు భరణంగా షమీ చెల్లిస్తున్నాడు. ఇక, ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్‌కు రూ. 1.5 లక్షలు అందుతున్నాయి. అయితే, ఈ మొత్తం పరిహారం సరిపోవట్లేదని షమీపై హసీన్‌ మరోసారి కోర్టుకు పోయింది.

Read Also: Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయితే, గతంలోనూ ఇదే అంశంపై ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్‌ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని సుప్రీంకోర్టును హసీన్‌ ఆశ్రయించింది. ఆమె తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తాడు.. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో విడిచి పెట్టాడు అని తెలిపారు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది.. హసీన్‌కు ఎలాంటి ఆదాయ వనరులు లేవు.. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి, షమీ తమ క్లయింట్‌కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించాలి అన్నారు.

Read Also: CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్

ఇక, లాయర్ల వాదన ముగిసిన తర్వాత న్యాయస్థానం హసీన్‌కు పరోక్షంగా చురకలు అంటించ్చినట్లు సమాచారం. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని క్వశ్చన్ చేశారని తెలుస్తుంది. అయితే, షమీ-హసీన్‌లు 2014లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు వీళ్లు కాపురం సజావుగా కొనసాగింది. వీరిద్దరికి ఓ అమ్మాయి జన్మించింది. అనంతరం షమీ- జహాన్ మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే, 2018లో షమీపై హసీన్‌ గృహ హింస, వేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వీరూ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్‌కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్‌కు చెల్లించాలని మహ్మద్ షమీకి ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version