Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- 27 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి
- క్రీడా సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ దలాల్ హఠాన్మరణం చెందాడు. 27 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. మోహిత్ అద్భుతమైన కబడ్డీ ఆటగాడు. భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అనేక టైటిళ్లను గెలుచుకున్నాడు. కెనడా, దుబాయ్, ఇంగ్లాండ్‌లో కూడా అనేక ట్రోఫీలను గెలుచుకున్నాడు. మోహిత్ అద్భుతమైన రైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన వాడు. హఠాన్మరణంతో క్రీడా సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
నివేదికల ప్రకారం.. బుధవారం ఉదయం మోహిత్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో చికిత్స కోసం వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే మరణించినట్లు వెల్లడించారు. మోహిత్ మరణం కబడ్డీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దలాల్ హర్యానాలోని జింద్ జిల్లా, నంద్‌గఢ్ గ్రామానికి చెందినవాడు.
మోహిత్ కొన్ని రోజుల క్రితం గాయపడ్డాడు. ఇటీవల శస్త్రచికిత్స జరిగింది.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మైదానంలోకి తిరిగి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
మోహిత్ 10 సంవత్సరాల వయస్సులో కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. గ్రామ మాజీ మల్లయోధుడైన ప్రకాష్ క్రీడలో శిక్షణ ఇచ్చాడు. కఠోర శ్రమ, కఠోరమైన రోజువారీ సాధన ద్వారా కబడ్డీ క్రీడలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించాడు. షిలు బల్హారాతో సహా అనేక ప్రముఖ ఆటగాళ్లతో పోటీపడ్డాడు. మోహిత్ అనేక ప్రధాన కబడ్డీ టోర్నమెంట్లలో ఉత్తమ రైడర్‌గా కూడా నిలిచాడు.
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?