Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Trade: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించి మరోసారి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ.. పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఫిట్‌నెస్‌పై ఆందోళనలు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉండటంతో హార్దిక్‌కు ఐపీఎల్లో భారీ డిమాండ్ ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై పలు జట్లు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సహా కొన్ని ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. తాజాగా ఒక జట్టు హార్దిక్ కోసం మరోసారి ముంబై మేనేజ్మెంట్ను సంప్రదించింది. ముంబై కూడా కొన్ని ఫ్రాంచైజీలతో హార్దిక్ ట్రేడ్ అంశంపై చర్చలు జరిపింది. హార్దిక్ ట్రేడ్‌లో సీఎస్కే పేరు కీలకంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చెన్నై జట్టుకు హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియమితుడు కావడంతో.. హార్దిక్ సీఎస్కేకు వెళ్లే అవకాశాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముంబై మేనేజ్మెంట్లో జహీర్ ఉన్న సమయంలో హార్దిక్‌తో అతడికి విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
Also Read
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
అయితే ఇప్పుడు పరిస్థితులు మారనున్నాయి క్రిక్‌బజ్ తన నివేదికలో పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్‌లో కొత్త మేనేజ్మెంట్, కొత్త సెటప్ ఏర్పడటంతో గతంలోని వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాలు మారనున్నాయట. అందువల్ల జహీర్ ఖాన్, హార్దిక్ పాండ్యా మధ్య విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేము. హార్దిక్ ట్రేడ్‌పై వచ్చే నెల రోజుల్లో క్లారిటీ రానుంది. ఐపీఎల్ రిటెన్షన్‌కు నవంబర్ 15 చివరి తేదీ కాబట్టి.. అప్పటిలోగా ఫ్రాంచైజీలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్లో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో హార్దిక్ భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్ అతడి ఫిట్నెస్ను పరిశీలిస్తోంది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా ప్రణాళికల్లో కీలక ఆటగాడిగానే ఉన్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పగల సామర్థ్యం హార్దిక్‌కు ఉండడం అతడికి కలిసొచ్చే అంశం. దీంతో ఐపీఎల్లో అతడి ట్రేడ్ వ్యవహారం అటు ముంబై ఇండియన్స్‌తో పాటు ఇటు ఇతర ఫ్రాంచైజీల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం హార్దిక్ ముంబైలోనే కొనసాగుతున్నప్పటికీ.. రిటెన్షన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రేడ్‌పై వస్తున్న తాజా నివేదికలు ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి