IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: Rims Medical College: రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు మరోసారి ధర్నాకు దిగిన జూనియర్ డాక్టర్లు
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న టీంగా ముంబై ఇండియన్స్‌కి పేరుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ టీంలో ఉండగా.. ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఇప్పుడు అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించబోతోంది. అయితే రోహిత్ శర్మ భవితవ్యం ఎంటనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ని హార్దిక్ పాండ్యా లీడ్ చేయనున్నారు.
ముంబైకి పదేళ్ల పాటు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించారు. ఆయన సారధ్యంలో ముంబై జట్టు ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. మరోవైపు కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, ఆడిన తొలి సీజన్ లోనే 2022 ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.
