Hardik Pandya Odisha Fan: భారత క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యను అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో మరోసారి నిరూపితమైంది. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల యువ క్రికెట్ అభిమాని హార్దిక్‌ను ఒక్కసారి కలవాలనే లక్ష్యంతో ఏకంగా 1,800 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. దాదాపు 12 రోజుల పాటు నిరంతర ప్రయాణం చేసి.. తన అభిమాన క్రికెటర్‌ను కలవడానికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో వైరల్ కాగా.. ఆ యువకుడి అంకితభావం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎన్నో కష్టాలు పడుతూ బెంగళూరుకు చేరుకున్న యువ అభిమానిని హార్దిక్ పాండ్య ఆప్యాయంగా కలిశాడు. తనతో ప్రత్యేకంగా మాట్లాడి, అతను తీసుకొచ్చిన శ్రీ జగన్నాథుడి విగ్రహాన్ని ప్రేమతో స్వీకరించాడు. అంతేకాకుండా అభిమానితో కలిసి ఫొటోలు దిగుతూ అతని కలను నిజం చేశాడు. అభిమాని చూపించిన ప్రేమకు ప్రతిగా హార్దిక్ పాండ్య కూడా గొప్ప మనసు చాటుకున్నాడు. భారత జట్టు సంతకం చేసిన జెర్సీని బహుమతిగా అందించడమే కాకుండా.. అతడికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. అలాగే స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చును కూడా అందించాడు.
విరాట్ కోహ్లీ బ్రాండ్ షూస్‌ను కూడా ఆ యువ అభిమానికి హార్దిక్ పాండ్య బహుమతిగా ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హార్దిక్ చేసిన ఈ సహాయం, అభిమానిపై చూపిన ప్రేమను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నిజమైన స్టార్’, ‘హార్దిక్ ప్యూర్ జెంటిల్‌మన్’, ‘అభిమానుల ప్రేమను గౌరవించే క్రికెటర్’ అంటూ ప్రశంసిస్తున్నారు. అభిమాని కోసం హార్దిక్ చేసిన ఈ ప్రత్యేక సాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హార్దిక్ పునరావాసం కోసం బెంగళూరులో ఉంటున్న విషయం తెలిసిందే.

