NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ పాండ్యా సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌

Hardik Instagram Record

Hardik Instagram Record

Hardik Pandya Creates World Record As Cricketer On Instagram: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రభంజనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని అరుదైన ఘనతల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఓ సంచలన రికార్డ్‌ని నమోదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన హార్దిక్.. ఈ ఫీట్ సాధించిన అతి పిన్న వయస్కుడైన (29 ఏళ్లు) క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అతడు టెన్నిస్ దిగ్గజాలైన రఫెన్ నాదల్ (17.9M), రోజర్ ఫెదరర్ (11+M), ప్రముఖ రేసర్ మాక్స్ వెర్స్‌టాపెన్ (9.5M), ఎర్లింగ్ హాలాండ్ (24.3M)లను అధిగమించాడు.

Satya kumar: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విదేశీ పెట్టుబడులు ఒక్కపైసా రాలేదు..!

సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పాండ్యా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాడు. ఆమధ్య తన పెళ్లి ఫోటోలను హార్దిక్ షేర్ చేసినప్పుడు.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇలా అతడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండటం వల్లే.. ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 25 మిలియన్ మార్క్ అందుకొని, అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి ఒక్క అభిమాని తనకు ఎంతో ప్రత్యేకమని, ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు

Show comments