Site icon NTV Telugu

Harbhajan Singh: పాకిస్థాన్ ప్లేయర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్.. నెటిజన్స్ ఫైర్!

Harbajan

Harbajan

Harbhajan Singh: అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. బుధవారం నాడు నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నార్తర్న్ వారియర్స్ 115 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆస్పిన్ స్టాలియన్స్ 110/7కి పరిమితమైంది. నార్తర్న్ వారియర్స్ పాక్ బౌలర్ షానవాజ్ దహానీ 2 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇన్నింగ్స్ చివరి హర్భజన్ బంతికి రనౌట్ అయిన తర్వాత దహానీకి షేక్ హ్యాండ్ ఇచ్చి భజ్జీ అభినందించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: Deepika Padukone: ఆ తప్పులు గుర్తొస్తే ఇప్పటికి బాధేస్తుంది.. దీపిక ఎమోషనల్ కామెంట్స్

అయితే, గత ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన పలు మ్యాచ్‌లలో టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు నో షేక్‌హ్యాండ్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానం మెన్స్ జట్టుతో పాటు భారత మహిళల టీమ్‌ కూడా అనుసరించింది. ఇక, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నిరాకరించింది. ఆ జట్టులో హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్ లాంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు. సెమీస్‌లో కూడా పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ భారత్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఫలితంగా పాక్ ఫైనల్‌కు వెళ్లింది.. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్లేయర్ కు హర్భజన్ సింగ్ పాక్ ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

Exit mobile version