Site icon NTV Telugu

IPL 2022: హర్భజన్ ఆల్‌టైం ఐపీఎల్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?

Harbhajan 1

Harbhajan 1

టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఐపీఎల్‌లో తన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. హర్భజన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా క్రిస్‌గేల్, రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వన్‌డౌన్‌ ప్లేయర్‌గా భజ్జీ పేర్కొన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. వికెట్ కీపర్‌గా ధోనీని హర్భజన్ ఎంచుకున్నాడు. ఈ టీమ్‌కు కెప్టెన్‌ కూడా ధోనీనే అని అతడు పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్లుగా పొలార్డ్, రవీంద్ర జడేజా ఉంటారని హర్భజన్ వెల్లడించాడు. అలాగే 9వ స్థానంలో సునీల్ నరైన్, 10వ స్థానంలో లసిత్ మలింగ, 11వ స్థానంలో బుమ్రా ఉంటారని తెలిపాడు.

హర్భజన్ సింగ్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా.

కాగా హర్భజన్ 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. తరువాతి మూడు ఎడిషన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడిన హర్భజన్‌కు అదే లాస్ట్ సీజన్. ఐపీఎల్‌లో మొత్తం 163 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 150 వికెట్లు పడగొట్టాడు. 7.07ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడు.

Exit mobile version