NTV Telugu Site icon

Dance : స్టెప్పులేసిన టీమిండియా మాజీలు.. నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్..

Suresh Raina

Suresh Raina

లెజెండ్ లీగ్ క్రికెట్2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాన్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు సాంగ్ కు చిందేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్ చరణ్, తారక్ లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్ తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజన్.. సురేశ్ రైనా( 41 బంతుల్లో 49, 2 ఫోర్లు, 3 సిక్సులు), బిస్లా(36), ఇర్ఫాన్ పఠాన్(25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ( 3-0-18-3), పోఫు(4-0-22-2), టీనో బెస్ట్(4-0-27-2) చెలరేగారు.

Also Read : Vijayashanti: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. చీకట్లో నెట్టారు

అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57, 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్ కు షేన్ వాట్సన్(26), సమిత్ పటేల్(12) సహకరించారు. మహారాజాన్ బౌలర్లలో యూసఫ్ పఠాన్(4-0-14-2), ప్రవీణ్ తాంబే( 4-0-22-1), హర్భజన్(4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో వికెట్లు పడగొట్టి తమ జటటును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

Also Read : Nani: సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను

ఈ మ్యాచ్ లో ఇండియా మహారాజాన్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర్ గైర్హజరీతో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్ లో మహారాజాన్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్ లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్ ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్ ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్ ఇవాళ(మార్చ్16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి.

Also Read : Budget 2023-24: సంక్షేమం, విద్యా, వైద్యానికి సర్కార్‌ పెద్ద పీట..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాలు ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకూ అందరు నాటు నాటు సాంగ్ కు కాలు కదుపుతున్నారు. ఈ పాటకు టీమిండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా స్టెప్పులేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments