Site icon NTV Telugu

Common Wealth Games 2022: భారత్‌కు రెండో పతకం.. మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌లోనే..!!

Gururaj Poojari

Gururaj Poojari

Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజారీ కాంస్యం సాధించాడు. ఈ పోటీల్లో గురురాజ్ పుజారీ 269 కిలోలను ఎత్తి కాంస్యం గెలుచుకున్నాడు. భారత వెయిట్‌లిఫ్టర్ గురురాజ్ తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 114 కేజీలు, రెండోసారి 118 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో గురురాజ్ మూడో ప్రయత్నంలో 151 కిలోల లిఫ్ట్‌తో తన పతకాన్ని ముగించాడు. కాంస్యం కోసం అతనికి, కెనడాకు చెందిన యురి సిమార్డ్‌కు మధ్య పోరు జరిగింది. ఈ పోరులో గురురాజ్ పుజారీ 268 కేజీలను ఎత్తి భారత్‌కు పతకం అందించాడు. ఈ విభాగంలో మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ ముహమ్మద్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇప్పటికే 55 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గార్ రజతం గెలిచిన విషయం తెలిసిందే.

కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్న గురురాజ్ పుజారీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జీవితంలో గురురాజ్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అటు దేశానికి తొలి పతకం అందించిన సంకేత్ సర్గార్ ను కూడా ప్రధాని అభినందించారు.

Exit mobile version