ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుతా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్లు 174/4 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ 137 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 56 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.
Also Read : Gujarat Riots Case: నరోదాగామ్ కేసులో నిందితులందరూ నిర్దోషులే.. అహ్మదాబాద్ కోర్టు సంచలన తీర్పు
అయితే ఆర్సీబీ ఓపెనింగ్ జోడిని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. దినేశ్ కార్తీక్ కూడా ఇప్పటికే 5 బంతుల్లో ఓ ఫోర్ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 7, షాబజ్ అహ్మద్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం కష్టాల్లో పడింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ అథర్వ టైడే ఇన్సింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించిన.. ఇక రెండో బంతికి ఇన్‌స్వింగర్ తో ఆర్సీబీ బౌలర్ సిరాజ్.. పంజాబ్ బ్యాటర్ అథర్వ టైడేను బోల్తా కొట్టించాడు.
Also Read : School girls: స్కాలర్‌షిప్ డబ్బులతో నిమ్మరసం.. వేసవిలో ప్రయాణికులకు బాలికల సేవ!
ఇక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ పతనం ప్రారంభమైంది. 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన పంజాబ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోగా.. ఫస్ట్ ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూ షార్ట్ ( 8) ను హసరంగ తన గూగ్లీ బౌలింగ్ తో ఔట్ చేయగా.. 27 పరుగులకే 2 రెండు వికెట్లను కోల్పోయింది. పంజాబ్ స్టార్ బ్యాటర్ లివింగ్ స్టోన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. లివింగ్ స్టోన్ (2) ను సిరాజ్ ఎల్బీడబ్య్లూగా పెవిలియన్ కు పంపించాడు. దీంతో పంజాబ్ 4 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్స్ నష్టపోయింది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్ లో 49 పరుగుల వద్ద నాలుగవ వికెట్ గా హర్‌ప్రీత్ సింగ్ భాటియా రన్ అవుట్ రూపంలో ఔట్ అయ్యాడు. 77 పరుగుల వద్ద సామ్ కర్రన్ కూడా రన్ అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ గెలుపుపై ఆశలు వదులుకుంది.
Also Read : Volodymyr Zelensky: ఇదే సమయం.. మమ్మల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను కోలుకోలేని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ ప్రభసిమ్రన్ ని పార్నెల్ ఔట్ చేయడంతో పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టును ఆదుకునేందుకు ప్రభసిమ్రన్ కష్టపడిన అతనికి మరోవైపు నుంచి సాయం చేసేవాళ్లు లేకుండా పోయారు. ప్రభసిమ్రన్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు.. జితేశ్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 41 పరుగులు చేసి లాస్ట్ వికెట్ గా వెనుదిరిగిపోయాడు. మిగతా ప్లేయర్స్ అందరు విఫలం కావడంతో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి.. కీలకమైన 4 వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.