Site icon NTV Telugu

Foot Ball : ఫుట్ బాల్ లో సంచలనం.. లాంగెస్ట్‌ గోల్‌

Long Goal

Long Goal

ఫుట్ బాల్ లో గోల్ కీపర్ ఏం చేయాలి ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్ ను అడ్డుకోవడం.. ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారి ఒక లాంగెస్ట్ గోల్ గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొల్ కొలో మధ్య జరిగిన మ్యా్చ్ లో చోటు చేసుకుంది. దాదానె 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్ పోస్ట్ లోకి బంతి వెళ్లడంతో ఫుట్ బాల్ చరిత్రలో లాంగెస్ట్ గోల్ గా చరిత్రలోకి ఎక్కింది.

Also Read : TDP Mlas Suspension: మళ్ళీ అదే సీన్… ఈసారి రెడ్ లైన్ నిబంధనతో సస్పెన్షన్

ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొల్ కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ ను దాటుకుని అతని తలపై నుంచి గోల్ పోస్ట్ లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరింగి. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్ గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో కోల్ జట్టుపై సంచలన విజయం సాధించింది.

Also Read : NTR 30: ఎన్టీఆర్ సినిమాకి జక్కన వారసుడు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు…

ఇంతకుముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్ బాల్ ఆటగాడు 96.1మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్ పోస్ట్ లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version