Site icon NTV Telugu

భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: క్రిస్ గేల్

73 వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తనకు మెస్సేజ్ పంపించినట్టు తెలిపాడు. ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. ‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెస్సేజ్ చూసి నిద్ర లేచాను.

Read Also: పుజారా, రహానెలకు షాక్… కాంట్రాక్ట్ గ్రేడ్‌లను తగ్గించిన బీసీసీఐ

మోడీతో, భారత ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండడం తెలిసిందే. యూనివర్స్ బాస్ నుంచి శుభాకాంక్షలు, ఎంతో ప్రేమతో’’ అంటూ గేల్ ట్వీట్ చేశాడు. తనను తాను యూనివర్స్ బాస్ గా గేల్ అభివర్ణించుకున్నాడు. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగానూ ఇదే పదాన్ని ఆయన ప్రయోగించాడు. భారత్ లో క్రిస్ గేల్ (42) ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విధ్వంసకర బ్యాటింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున గేల్ చాలా మ్యాచ్ లు ఆడాడు.


Exit mobile version