NTV Telugu Site icon

Gary Ballance: జింబాబ్వే క్రికెటర్ హిస్టరీ.. రెండు దేశాల తరఫున..

Gary Ballance

Gary Ballance

Gary Ballance Becomes 16th Cricketer Play Tests For 2 Nations: జింబాబ్వే క్రికెటర్‌ గ్యారీ బ్యాలెన్స్‌ చరిత్ర సృష్టించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్‌, జింబాబ్వే) తరఫున టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన 16వ క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. విడ్డూరమైన విషయం ఏంటంటే.. బ్యాలెన్స్‌ తొలుత పరాయి దేశం ఇంగ్లండ్‌ తరఫున ఆడి, ఆ తర్వాత సొంత దేశానికి ఆడాడు. క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇలా రివర్స్‌లో ఆడటం ఇదే మొదటిసారి. ఆల్రెడీ రెండు దేశాల తరఫున ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత తమ సొంత దేశం తరఫున ఆడారు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఇతర దేశాల తరఫున ప్రాతినిథ్యం వహించారు. కానీ.. బ్యాలెన్స్ మాత్రం రివర్స్‌లో మొదట ఇంగ్లండ్ తరఫున ప్రాతినిథ్యం వహించి, ఇప్పుడు సొంత దేశానికి ఆడుతున్నాడు.

Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్

నిజానికి.. గ్యారీ బ్యాలెన్స్ జింబాబ్వేలోనే పుట్టి, పెరిగి, విద్యను అభ్యసించాడు. అయితే.. 2006లో బ్రిటన్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. క్రికెట్ మీద ఉన్న ప్రేమతో, ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాడు. ఆ కలల్ని సాకారం చేసుకున్నాడు కూడా. కౌంటీల్లో సత్తా చాటి.. 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. 2017 వరకు, అంటే నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ.. ఆ తర్వాత ఫామ్‌లేమీ కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్‌.. ఆతర్వాత ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి జట్టులో స్థానం పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ, అతనికి అవకాశాలు రాలేదు. దీంతో.. అతడు తిరిగి తన సొంత గూటి అయిన జింబాబ్వేకి చేరుకున్నాడు.

Jr NTR: అమిగోస్ ఈవెంట్ సాక్షిగా.. ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన ఎన్టీఆర్

ఫిబ్రవరి 4వ తేదీన వెస్టిండీస్‌తో మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌ ద్వారా గ్యారీ బ్యాలెన్స్‌ జింబాబ్వే తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు ఆడిన గ్యారీ.. 37.5 సగటున 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో కలిపి 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున 18 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు.