NTV Telugu Site icon

European Cricket : అబ్బా బాల్ అక్కడ తగిలింది..

Eropian Cricket

Eropian Cricket

క్రికెట్ లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు అయ్యో పాపం అనుుకంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా అవస్థలు పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్ లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. బ్రదర్స్ ఎలెవన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరుగింది. ఇండియన్ రాయల్స్ ఇన్సింగ్స్ సమయలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు.. సింగిల్ పూర్తి చేశారు.. అయితే తర్వాత ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు.

Also Read : Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష

అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం బ్యాటర్ నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విసయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్సింగ్స్ కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్సం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్ సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్ కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్ లో బ్రదర్స్ ఎలెవన్ జట్టు విజయం సాధించింది.

Also Read : Maha dharna in Indira Park: ఇందిరాపార్క్‌లో నిరుద్యోగ మహా ధర్నా.. పాల్గొన్న బండి సంజయ్