Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
- పాకిస్థాన్ మహిళల జట్టుకు మరో ఓటమి
- పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం
- ఓటమిపై నిరాశ వ్యక్తం చేసిన పాక్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatima Sana Reaction on PAKW Defeat vs SAW: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ మహిళల జట్టు ఓటమిపాలైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌ను దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు రన్స్ చేసి గెలిచింది. ఈ ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా నిరాశ వ్యక్తం చేసింది. వరుసగా రెండు మ్యాచ్లి ఓడడం చాలా బాధగా ఉందని.. ఇక టోర్నీలో తమని ఆ అల్లానే కాపాడాలని చెప్పుకొచ్చింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాతిమా సనా.. జట్టులో పోరాట పటిమ ఉన్నప్పటికీ మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో విఫలమయ్యామని అంగీకరించింది. ‘మేము చివరి వరకు పోరాడాం. మా ప్లేయర్స్ చివరి వరకు బాగా ఆడారు. కానీ మ్యాచ్‌ను ముగించలేకపోయాం’ అని తెలిపింది. ఈ మ్యాచ్‌లో ఫాతిమా సనా, టుబా హసన్‌తో కలిసి 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ భాగస్వామ్యం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతో మేము బ్యాటింగ్ చేశాం. మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. టుబా కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లలో ఒకరు. అందుకే ప్రణాళిక ప్రకారం ఆడేందుకు ప్రయత్నించాం’ అని వివరించింది.
Also Read
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Mitchell Santner: "వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు".. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందుకు రావాల్సింది అనే ప్రశ్నకు ఫాతిమా సనా సమాధానం ఇచ్చింది. ‘అది పూర్తిగా జట్టు నిర్ణయం. మేమంతా కలిసి చర్చించుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం. జట్టు అవసరాలకు అనుగుణంగా నేను ఆ పాత్రను స్వీకరించాను’ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో పాటు మూడు వికెట్లు కూడా తీసిన ఫాతిమా.. కెప్టెన్‌గా తన బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ‘కెప్టెన్సీ బాధ్యతను నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. కానీ కేవలం వ్యక్తిగత ప్రదర్శనలు సరిపోవు. జట్టు విజయాలు సాధించాలి. టోర్నీలో ఇంకా మేం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వరుసగా రెండు గేమ్స్ ఓడాం. ఇకనైనా విజయాల బాట పట్టాలి. లేదంటే మూల్యం చెలిచుకోవాల్సిందే’ అని తెలిపింది.
తదుపరి మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు స్పందించిన ఫాతిమా సనా.. జట్టు మరింత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అంకూలంగా లేనపుడు మరింత ప్రశాంతంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ అంశంలో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాం. పాక్ జట్టు విజయాలే నాకు ముఖ్యం’ అని పాక్ సారథి ఫాతిమా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!