Travis Head Scripts History In Ashes: 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెను విధ్వంసం సృష్టించాడు.పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 69 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ బాదాడు. యాషెస్ చరిత్రలో ఇది రెండవ వేగవంతమైన సెంచరీ. 2006లో ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రావిస్ హెడ్‌కు ఇది 10వ సెంచరీ. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో బౌలర్లు ఆధిపత్యం చెలాయించినా.. హెడ్ మాత్రం టీ20 మ్యాచ్‌లా చెలరేగడం విశేషం.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా ట్రావిస్ హెడ్ పేరుపై లిఖించబడింది. జో డార్లింగ్ 127 ఏళ్ల రికార్డును హెడ్ బద్దలు కొట్టాడు. 1898లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆసీస్ తరపున డార్లింగ్ 85 బంతుల్లో సెంచరీ చేశాడు. పెర్త్ టెస్టుతో డార్లింగ్ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. యాషెస్‌లో ఐదవ వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు కూడా సాధించాడు. పెర్త్ టెస్టుతో హెడ్ 36 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. 1895లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాన్ బ్రౌన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రాహం యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ పరిస్థితేంటి.. ‘ఆల్కహాల్’ అయినా మత్తు ఎక్కించేనా?
యాషెస్ టెస్ట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. పెర్త్ టెస్టులో హెడ్ నాలుగు సిక్సర్లు బాదాడు. పెర్త్ టెస్టులో హెడ్ 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 రన్స్ చేశాడు. హెడ్ సునామి ఇన్నింగ్స్‌తో ఆసీస్ సునాయాస విజయం అందుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 28.2 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజయంలో స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కూడా కీలక పాత్ర పోషించాడు. స్టార్క్ తన 12.5 ఓవర్ల స్పెల్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. 4.50 ఎకానమీ రేటుతో 58 పరుగులు ఇచ్చాడు.
