Fans Fire On Gautam Gambhir Tweet On Suryakumar Yadav: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే! లంక బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి, చివరివరకు అజేయంగా నిలిచాడు. ఇతని వల్లే ఆ మ్యాచ్ భారత్ గెలిచిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అందుకే.. అతనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. విదేశీ ఆటగాళ్ల నుంచి మాజీల దాకా.. అందరూ అతడ్ని ఆకాశానికెత్తేశారు. గౌతమ్ గంభీర్ సైతం అతడ్ని మెచ్చుకున్నాడు. అదే సమయంలో సూర్యను టెస్ట్ క్రికెట్ ఆడించే సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డాడు. ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్ సూర్య, ఇతడ్ని ఇక టెస్టు క్రికెట్ ఆడించే సమయం ఆసన్నమైంది’’ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే.. గౌతమ్ గంభీర్ అభిమానులు మాత్రం అతని అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయం నీ నుంచి ఊహించలేదంటూ రివర్స్ ఎటాక్‌కి దిగారు. ఇప్పుడు సూర్యని టెస్టుల్లో ఎందుకు తీసుకోవాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు. రంజీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్ల సంగతేంటని అడుగుతున్నారు. ఉదాహరణకు సర్ఫరాజ్ పేరుని సిఫార్సు చేస్తున్నారు. ఈమధ్య రంజీ ట్రోఫీల్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని, అలాంటి వాళ్లకు టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. టెస్ట్‌కి, టీ20కి చాలా డిఫరెన్స్ ఉంటుందని.. కేవలం వైట్ బాల్ ఫామ్‌ని చూసి ఇలా టెస్టుల్లో తీసుకోవాలని సూచించడాన్ని తాము సమ్మతించమని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. సర్ఫరాజ్‌తో పాటు విహారి కూడా ఉన్నాడని.. వాళ్లకి ఛాన్స్ ఇవ్వాల్సిందేనంటున్నారు. సూర్యని టెస్టుల్లోనే కాదు, వన్డేల్లోనూ తీసుకోవద్దని పేర్కొంటున్నారు.
Expected better from you Gauti. Why does he make the team team? What about those who have been scoring runs in Ranji cricket. Sarfaraz for example? Not setting the right example if you pick someone based on white ball form for a completely different game
— Arup Ghose (@arup_ghose) January 7, 2023
Why You Are Not Talking About Sarfaraz And other Ranji Players You Already Have Vihari
Please Don't Want Him In Tests And Also Not In ODIs— Alfaz Dodiya (@alfaz_dodiya) January 7, 2023