NTV Telugu Site icon

సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల కింద‌టి రికార్డు బ్రేక్

న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వె అరంగేట్రం టెస్టులోనే 25 ఏళ్ల నాటి సౌరవ్ గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వె (136 బ్యాటింగ్: 240 బంతుల్లో 16×4) శతకం బాదేశాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచిన కాన్వె.. సౌరవ్ గంగూలీ 1996లో అక్కడ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోరు రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. 1990 తర్వాత ఓ పర్యాటక బ్యాట్స్‌మెన్ లార్డ్స్‌లో అరంగేట్రం చేసి సెంచరీ కొట్టడం ఇది రెండోసారి. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్.. మొదటి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.