Site icon NTV Telugu

ENG vs India : ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన బుమ్రా..

Bumrah

Bumrah

ఇంగ్లండ్‌-భారత్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ లో నేడు తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం.. 14.3 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ 59 పరుగులు మాత్రమే తీసింది.

అయితే.. 6 పరుగుల వద్ద మొదటి, రెండు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌. 7 పరుగుల వద్ద 3 వికెట్‌ను, 17 పరుగుల వద్ద నాల్గవ వికెట్‌ను, 26 పరుగుల వద్ద 5వ వికెట్‌ను, 53 పరుగుల వద్ద 6వ వికెట్‌ను, 59 పరుగుల వద్ద 7వ వికెట్‌ను చేజార్చుకుంది. అయితే.. ఇప్పటి వరకు బుమ్రా 5 ఓవర్లు వేసి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే షమీ 2, ప్రసిద్‌ కృష్ణ 1 వికెట్లను తీశారు.

 

Exit mobile version