NTV Telugu Site icon

India vs England 2nd T20: కట్టుదిట్టంగా బౌలింగ్.. భారత్ లక్ష్యం 166 పరుగులు..

T20

T20

భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 165 పరుగులు చేసింది. భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ జోస్ బట్లర్ అత్యధిక స్కోరు 30 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. జామీ స్మిత్ 22 పరుగులు చేయగా, బ్రేడన్ కార్సే 31 పరుగులు చేశారు. భారత్ తరపున అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మలు తలో వికెట్‌ తీశారు.