ఐపీఎల్-15 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌లోనే ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ చెప్తున్నా.. కరోనా కేసుల నేపథ్యంలో దక్షిణాఫ్రికా లేదా దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో లేదో అన్న విషయం ఆసక్తిగా మారింది.
Read Also: టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో లుకలుకలు
ఇప్పటికే రూట్, బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలానికి దూరంగా ఉంటామని స్వయంగా ప్రకటించారు కూడా. అయితే కొందరు ఆటగాళ్లు తొలి అంచె పోటీల్లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని ఈసీబీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ మెగావేలంలో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ టెస్టు ఆటగాళ్ల సంగతి అయోమయంలో పడింది. ఈ జాబితాలో ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్ స్టో, మార్క్‌వుడ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ముందుకు వెళ్లాలంటే కీలక ఆటగాళ్లు అవసరమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నారని తెలుస్తోంది.
