NTV Telugu Site icon

Rishi Sunak : ఇంగ్లండ్ క్రికెటర్ వలలో బ్రిటన్ ప్రధాని.. అంతా అతని వల్లే..?

Uk Pm

Uk Pm

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్స స్ట్రీట్ కు ఇంగ్లండ్ ఆటగాళ్లు ముఖ్య అతిథులుగా రిషి సునాక్ ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరణ్, డేవిడ్ మలాన్, ఫిల్ స్టాల్, టైమల్ మిల్స్, రిచర్డ్, క్రిస్ జోర్డాన్ లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు.

Also Read : Viral Video: టేకాఫ్ అయిన వెంటనే ఆగిన ఇంజన్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

ముందు బ్యాటింగ్ లో కవర్ డ్రైవ్ తో అలరించిన బ్రిటన్ ప్రధాన మంత్రి.. ఆ తర్వాత జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. బౌలర్ జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనిదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్ లో సామ్ కరన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. ఇక టీ20 ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును ప్రధాన మంత్రి రిషి సునాక్ అభినందించడానిక తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Also Read : Brook Shields: రేప్ కు గురైన ‘బ్లూ లాగూన్’ భామ!

స్వతహగా క్రికెట్ అభిమాని అయిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తమ దేశం టీ20 క్రికెట్ లో వరల్డ్ ఛాంపియన్స్ గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించార. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ప్రధాని రిషి సునాక్ తన నివాసంలో సత్కరించారు.