Site icon NTV Telugu

యాషెస్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.

Read Also: 2028 ఒలంపిక్స్‌లో జెంటిల్మెన్‌ గేమ్‌కు దక్కని చోటు

మరోవైపు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను అనుచిత పదజాలంతో దూషించినందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్‌కి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత పడింది. కాగా బ్రిస్బేన్ టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వరుసగా నో బాల్స్ వేసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే అంపైర్ల తప్పిదాల కారణంగా ఆసీస్ జట్టు ఏకంగా మూడు అదనపు పరుగులను కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే అసహనం చెందిన ట్రావిస్ హెడ్.. బెన్ స్టోక్స్‌ను దూషించినట్లు తెలుస్తోంది.

Exit mobile version