Dootball coach Gareth Southgate was surprised by England declaration in Ashes 2023: గత కొంతకాలంగా ‘బజ్‌బాల్’ (దూకుడుగా ఆడటం-BazBall Cricket) క్రికెట్ ఆటను ఇంగ్లండ్ జట్టు బాగా ఫాలో అవుతోంది. దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. వేగంగా పరుగులు చేసేసి.. ప్రత్యర్థి జట్లను కూడా ఇలాగే ఆడించి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ జట్టు ముందుకు సాగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులోనూ ఇదే ప్రణాలికను ఇంగ్లండ్ ఫాలో అయింది. టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే 393/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయంకు కొందరు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కోచ్ గారెత్ సౌత్‌గేట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి నిర్ణయం తన జీవితంలో మొదటిసారి చూస్తున్నట్లు తెలిపాడు. యూరో 2021 క్వాలిఫికేషన్ మ్యాచ్ సందర్భంగా సౌత్‌గేట్ మాట్లాడుతూ… ‘నేను వృత్తిపరంగా ఫుట్‌బాల్ కోచ్ అయినా.. క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్. యాషెస్ సిరీస్ 2023ను చూడటం చాలా ఉత్సాహంగా ఉంది. ఇంగ్లండ్ జట్టు మైండ్‌సెట్ ఎలా ఉందో ఆ నిర్ణయంతో వెల్లడైంది. అయితే ఆస్ట్రేలియాలోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారు. బజ్‌బాల్ క్రికెట్‌కు ఎంత త్వరగా మారతారనేదే ఇక్కడ కీలకం. తొలి రోజే 393/8 స్కోరు వద్ద ఇంగ్లండ్ డిక్లేర్డ్ చేయడాన్ని చూడటం ఇదే నా జీవితంలో మొదటిసారి. ఇలా చేయడంతో ఫలితం ఎలా ఉంటుందనే ఆతృత అభిమానుల్లో ఉంటుంది’ అని అన్నాడు.
Also Read:
Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
సెంచరీ చేసిన జో రూట్ ఔట్ కాకుండానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడం సరైంది కాదని ఆ జట్టు మాజీ కెప్టెన్లు నాజర్ హుస్సేన్, కెవిన్ పీటర్సన్ అంటున్నారు. ‘మేం డిక్లేరేషన్ గురించి మాట్లాడుతున్నాం. అలా ఎందుకు చేశారని ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాం. 2-3 ఏళ్ల కిందట డిక్లేర్డ్ వైపే వెళ్లేవారు కాదు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫ్లాట్ వికెట్ మీద త్వరగా డిక్లేర్డ్ చేయడం సరైంది కాదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను చూస్తున్నాం. వారు దీటుగా బదులిస్తున్నారు. నాకు త్వరగా డిక్లేర్డ్ చేయడం నచ్చలేదు’ అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. జో రూట్ (118 నాటౌట్; 152బంతుల్లో 7×4, 4×6) సెంచరీ చేశాడు. జాక్ క్రాలీ (61), జానీ బెయిర్‌స్టో (78) హాఫ్ సెంచరీలు బాదారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 4 వికెట్స్ పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311/5 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 279 బంతుల్లో 14×4, 2×6)తో పాటు అలెక్స్ కేరీ (52 బ్యాటింగ్) ఉన్నాడు.ఇంగ్లండ్ కంటే ఆసీస్ ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది.
Also Read: Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!