NTV Telugu Site icon

Ben Stokes: రీఎంట్రీ అదుర్స్.. 64 బంతుల్లోనే స్టోక్స్ సెంచరీ

Ben Stokes

Ben Stokes

ఇటీవల గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ మైదానంలో తన విశ్వరూపం చూపించాడు. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 64 బంతుల్లోనే సెంచరీ చేసి తనలోని సత్తాను బయటపెట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్ వేసిన ఒకే ఓవర్‌లో 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు, ఫోర్ సాధించాడు. దీంతో బెన్ స్టోక్స్‌ ఈజ్ బ్యాక్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

కాగా ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నియమితుడైన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం కావడంతో పాటు బలహీనమైన వెస్టిండీస్ జట్టుపైనా టెస్టుల్లో ఓటమి పాలైంది. దీంతో ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ జట్టు టెస్ట్ కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో రూట్ వారసుడిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను నియమించింది. ఇంగ్లండ్ జట్టు త్వరలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్టుల్లో తలపడనుంది. స్వార్థం లేని ఆటగాళ్లతో ఇంగ్లండ్‌ జట్టును టెస్టుల్లో ముందుకు నడిపిస్తానని.. సరైన కూర్పును ఎంచుకోవటమే టెస్టు మ్యాచ్‌లో విజయానికి ఉత్తమ మార్గం అని బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

Sehwag: జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి పెద్ద తప్పు చేశారు