నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ సమయం దగ్గరకు వస్తుండటంతోనే రద్దు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తాజాగా స్పందించాడు. టామ్ హారిసన్ మాట్లాడుతూ… బీసీసీఐ ఈ మ్యాచ్ ను రద్దు చేయాలి అని అనుకోలేదు. ఈ చివరి టెస్ట్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని బీసీసీఐ అనుకుంది. అయితే మొదట నాలుగో టెస్ట్ సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన బారిన పడ్డారు. అయిన మ్యాచ్ ను ఆపలేదు. కానీ ఈ రోజు చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియో కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంకా కరోనా కేసులు నమోదవుతాయి అని అనుకోని ఈ టెస్ట్ ను రద్దు చేసాం. అంతే కానీ ఐపీఎల్ కోసం కాదు అని టామ్ హారిసన్ తెలిపారు. ఇక ఇప్పటివరకు ఈ సిరీస్ లో జరిగిన నాలుగు టెస్ట్ లలో భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
చివరి టెస్ట్ రద్దు.. ఆ మాటల్లో నిజం లేదు : ఈసీబీ సీఈఓ
