పుష్ప మేనియా… వికెట్ తీయగానే శ్రీవల్లీ పాటకు స్టెప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప.. మేకర్స్‌పై కాసుల వర్షం కురిపించింది.. ఇక, అందులో డైలాగ్స్‌కు, సాంగ్స్‌కు ఓ రేంజ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు.. మొదట థియేటర్లలో రికార్డు బద్దలు కొట్టిన ఈ మూవీ.. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.. ఇప్పటికే ఎంతో మంది స్టార్ క్రికెటర్లు.. హీరో డైలాగ్స్‌ను రిపీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. ఇది కేవలం టీమిండియాకు మాత్రమే పరిమితం కాలేదు.. విదేశీ క్రికెటర్లు సైతం పుష్ప మేనియాలో పడిపోయారు.. తాజాగా, వెస్టిండిస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో.. ఏకంగా స్టేడియంలో స్టెప్పులు వేశాడు.
Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వారానికి ఐదు రోజులే పని..
Also Read
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు బ్రావో.. బీపీఎల్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చ్యూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జరిగింది.. ఇక, బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మహిదుల్ ఇస్లాం అంకాన్.. అది మిస్ కావడంతో ఫీల్డర్ చేతికి చిక్కింది.. అయితే, వికెట్ పడిన ఆనందంలో గ్రౌండ్‌లోనే స్టెప్పులు వేశాడు బ్రావో.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్ వేశాడు బ్రావో.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍
Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3
— FanCode (@FanCode) January 25, 2022
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!