Site icon NTV Telugu

పుష్ప మేనియా… వికెట్ తీయ‌గానే శ్రీవ‌ల్లీ పాట‌కు స్టెప్పులు

పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప.. మేక‌ర్స్‌పై కాసుల వ‌ర్షం కురిపించింది.. ఇక‌, అందులో డైలాగ్స్‌కు, సాంగ్స్‌కు ఓ రేంజ్‌లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు.. మొద‌ట థియేట‌ర్ల‌లో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఈ మూవీ.. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమాపై ఉన్న‌ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డంలేదు.. ఇప్ప‌టికే ఎంతో మంది స్టార్ క్రికెట‌ర్లు.. హీరో డైలాగ్స్‌ను రిపీట్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వైర‌ల్ కాగా.. ఇది కేవ‌లం టీమిండియాకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు.. విదేశీ క్రికెట‌ర్లు సైతం పుష్ప మేనియాలో ప‌డిపోయారు.. తాజాగా, వెస్టిండిస్ మాజీ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావో.. ఏకంగా స్టేడియంలో స్టెప్పులు వేశాడు.

Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వారానికి ఐదు రోజులే ప‌ని..

ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు బ్రావో.. బీపీఎల్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చ్యూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జ‌రిగింది.. ఇక‌, బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన‌ మహిదుల్ ఇస్లాం అంకాన్.. అది మిస్ కావ‌డంతో ఫీల్డ‌ర్ చేతికి చిక్కింది.. అయితే, వికెట్ ప‌డిన ఆనందంలో గ్రౌండ్‌లోనే స్టెప్పులు వేశాడు బ్రావో.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట‌కు అల్లు అర్జున్ వేసిన స్టెప్ వేశాడు బ్రావో.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Exit mobile version