ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. నికోలస్ పూరన్(62), మార్‌క్రమ్(42) రాణించినా రన్‌రేట్ పెరిగిపోవడంతో సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా.. నోర్జ్, మిచెల్ మార్ష్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ సాధించారు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ తన పాత టీమ్ సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుతిరిగినా వార్నర్ మాత్రం కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. అతడికి రోమ్‌వెల్ పావెల్ సహకరించాడు. అతడు 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
IPL 2022: శివాలెత్తిన వార్నర్, పావెల్.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
