NTV Telugu Site icon

DC vs SRH: డీసీ పరుగుల సునామీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Dc 10 Overs Score

Dc 10 Overs Score

Delhi Capitals Scored 105 Runs In First 10 Overs: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. సన్‌రైజర్స్ బౌలర్లపై విజృంభిస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి డీసీ జట్టు ఒక వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్ కురిపిస్తున్న పరుగుల వర్షం పుణ్యమా అని.. డీసీ జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. డీసీ ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. మరో 10 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సి ఉంటుంది. తొలి 10 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని దాటేసిన డీసీ.. మిగతా స్కోరు కొట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ని తమ సొంతం చేసుకోవాలంటే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. మరి.. చేస్తారా? లేక ఢిల్లీ చేతిలో మరోసారి ఓటమి పాలవుతారా?

Pooja Bhalekar: ఆ యాంగిల్స్ ఏంటి .. ఆ చూపించడం ఏంటి .. కుర్రాళ్ళు ఆగగలరా..?

లక్ష్య ఛేధనలో భాగంగా ఢిల్లీ జట్టుకి మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లోనే రెండో బంతికి ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. అతడు ఆన్-సైడ్‌లో షాట్ కొట్టబోతే.. బంతి బ్యాట్‌కు తగిలి వికెట్లవైపు దూసుకెళ్లడంతో, వార్నర్ బౌల్డ్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి సాల్ట్, మార్ష్‌ల ఊచకోత ప్రారంభమైంది. వీళ్లిద్దరు ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించారు. పవర్ ప్లేలోనే కాదు.. అది ముగిశాక కూడా తమ విజృంభణ ఆపలేదు. భారీ షాట్లతో వీళ్లిద్దరు ఎగబడ్డారు. మరో వికెట్ పడనివ్వకుండా.. 10 ఓవర్లలోనే వంద పరుగుల మైలురాయిని దాటించేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ నిరాశపరుస్తూ వచ్చిన ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి, తమ జట్టుని ఆదుకున్నారు.

Delhi: 11 ఏళ్ల బాలికపై టీచర్ లైంగిక వేధింపులు..

Show comments