Site icon NTV Telugu

Deepak Chahar: పెళ్లి చేసుకోబోతున్న మరో టీమిండియా ఆటగాడు

Deepak Chahar

Deepak Chahar

టీమిండియాకు చెందిన మరో ఆటగాడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జూన్ 1న ఆగ్రాలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దుబాయ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అప్పటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా దీపక్ చాహర్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. తాజాగా దీపక్ చాహర్ జయ భరద్వాజ్‌తో ఏడు అడుగులు వేయబోతున్నాడు.

Team India: దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ అవుట్..!!

దీపక్ చాహర్, జయ భరద్వాజ్ ఒక్కటి కావడంతో దీపక్ చాహర్ సోదరి మాల్తీ చాహర్ కీలక పాత్ర పోషించారు. ఆమె మోడలింగ్ రంగంలో పనిచేస్తున్నారు. మాల్తీ చాహర్ జయ భరద్వాజ్‌ను తన కుటుంబానికి పరిచయం చేయడంతో ఆమె అందరికీ నచ్చేసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య రాయబారం నడిచింది. జయ భరద్వాజ్ ఇంటి సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీపక్ చాహర్ పెళ్లి ఖరారైంది. కాగా చిన్నతనంలోనే జయ తండ్రి చనిపోవడంతో తండ్రి హోర్డింగ్ డిజైన్ వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచింది. జయ భరద్వాజ్‌కు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సిద్ధార్థ్. అతడు ఎంటీవీలో ఫ్యాషన్ షోలలో కనిపించేవాడు.

Exit mobile version