ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రామ్ చరణ్ తేజ్ ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ”వినయ విధేయ రామ” సినిమాలోని ఫైటింగ్ వీడియోను క్లిప్పింగ్స్‌ను తన ముఖానికి జోడించి అలరించాడు. రామ్ చరణ్‌లా ఫైటింగ్, డైలాగ్‌లు చెప్పుతూ ఆకట్టుకున్నాడు వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో లైక్స్, కామెట్స్ వస్తున్నాయి.
read also : ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టివేత..
కాగా.. వార్నర్ గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది లాక్‌డౌన్ సమయంలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. అందరినీ అలరించాడు. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ 14 వ సీజన్‌లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో సన్‌రైజర్స్ టీమ్ అతడిని కెప్టెన్‌గా తొలగించింది.
