న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌కు అనూహ్యంగా ఐసీసీ అవార్డు దక్కింది. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నవంబర్ 10న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌కు అడ్డుపడుతున్నాని భావించి డారిల్ మిచెల్ ఓ పరుగు తీయలేదు. దీంతో డారిల్ మిచెల్ చర్యను అభినందిస్తూ ఐసీసీ తాజాగా స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డును ప్రకటించింది.
Read Also: వివాదంలో గంగూలీ.. రెండుగా చీలిన బీసీసీఐ
సదరు మ్యాచ్‌లో 17 ఓవర్లు పూర్తయిన సమయానికి న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ రషీద్ 18వ ఓవర్ తొలిబంతిని వేశాడు. స్ట్రైక్‌లో ఉన్న కివీస్ ఆటగాడు జేమ్స్ నీషమ్ లాంగ్ ఆఫ్వైపు బంతిని బాది పరుగుకు ప్రయత్నించాడు. అయితే బంతిని ఆపేందుకు బౌలర్ రషీద్ ప్రయత్నిస్తున్న క్రమంలో అనుకోకుండా నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న డారిల్ మిచెల్ అడ్డువచ్చాడు. దీంతో రషీద్‌కు అడ్డుపడ్డానని భావించి నీషమ్‌ను మిచెల్ వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఈ మేరకు వారు పరుగు తీయలేదు. అయినా మిచెల్- నీషమ్ జోడీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. కాగా తనకు ఐసీసీ అవార్డు వచ్చినందుకు మిచెల్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని.. కానీ క్రికెట్లోని నైతిక విలువలను ఉల్లంఘించేది లేదని స్పష్టం చేశాడు.
