Site icon NTV Telugu

Dale Steyn: అతడు 360 డిగ్రీ ప్లేయర్.. ఆస్ట్రేలియా పిచ్‌లో చుక్కలు చూపిస్తాడు

Dayle Steyn On Sky

Dayle Steyn On Sky

Dale Steyn On Surya Kumar Yadav Form: టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత్ తరఫున ఎవరెవరు బాగా రాణించగలరన్న విషయంపై మన భారతీయులు సహా విదేశీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడంటూ దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్‌ వ్యాఖ్యానించాడు. అతని ఆటతీరుకు ఆస్ట్రేలియా పిచ్‌లు సరిగ్గా సరిపోతాయని.. మరీ ముఖ్యంగా పెర్త్‌, మెల్‌బోర్న్‌ మైదానాల్లో బాగా రాణిస్తాడని పేర్కొన్నాడు.

డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘బంతి పేస్‌ను సూర్యకుమార్ చాలా చక్కగా అర్ధం చేసుకొని, బ్యాటింగ్‌ చేయగలడు. పెర్త్‌, మెల్‌బోర్న్‌ పిచ్‌లు బౌన్సీగా కాబట్టి.. లెగ్‌సైడ్‌ షాట్లను అతడు అలవోకగా కొట్టగలడు. బ్యాక్‌ఫుట్‌ను ఉపయోగించుకొని, బౌండరీలు బాదగలడు. అంతేకాదు.. ముందుకు, వెనక్కి కవర్‌డ్రైవ్‌లు కూడా ఆడగలడు. అందుకే.. సూర్యకుమార్‌ని ఏబీ డీ విలియర్స్‌లాగా 360 డిగ్రీ ప్లేయర్ అనొచ్చు’’ అని చెప్పాడు. అలాగే.. ఆస్ట్రేలియా పిచ్‌లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటాయన్నాడు. బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులను సంధించవచ్చో.. బ్యాటర్లు కూడా అంతే పరుగులు రాబట్టేందుకు వీలుంటుందని స్టెయిన్ వెల్లడించాడు.

కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక ప్లేయర్‌గా నిలుస్తాడని ఇప్పటికే చాలామంది మాజీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. అన్నివైపులా షాట్లు కొట్టే సూర్య.. నాలుగో స్థానంలో భారీ పరులుగు సాధించగలడని తెలిపాడు. వాళ్లు చెప్పినట్టుగానే.. ఆసియా కప్‌ టోర్నీతో పాటు ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లలోనూ సూర్య తన సత్తా చాటాడు. మరి, ఇదే ఫామ్‌ని వరల్డ్‌కప్ టోర్నీలోనూ కొనసాగిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Exit mobile version