Site icon NTV Telugu

CSK vs RCB: దుమ్మురేపుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Csk Scoring High

Csk Scoring High

CSK Scored 97 Runs In First 10 Overs Against RCB: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఆడుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చితక్కొడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. తొలుత మ్యాచ్ ఆరంభమైనప్పుడు చెన్నై ఇన్నింగ్స్ నిదానంగానే మొదలైంది. సిరాజ్, పార్నెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ వికెట్‌ని సిరాజ్ తీసుకున్నాడు. అతడు వేసిన టెంప్టింగ్ బాల్‌ను షాట్ కొట్టబోయి.. క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడు అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. వచ్చి రాగానే రహానే బౌండరీలు బాదడం ప్రారంభించాడు. అతడ్ని చూసి కాన్వే సైతం రెచ్చిపోయాడు.

Minister Sidiri Appalaraju : పవన్ మాటల వెనుక అంతర్యం ఏమిటి..?

ఆర్సీబీ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీలుగా మలిచారు. ఫలితంగా.. చెన్నై స్కోరు పరుగులు తీసింది. రెండో వికెట్‌కి వీళ్లిద్దరు కలిసి ఏకంగా 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. 90 పరుగుల వద్ద హసరంగ వేసిన గూగ్లీ బంతికి రహానే బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. కాన్వే అర్థశతకం చేసుకున్నాడు. రహానే ఇచ్చిన జోష్‌తో చెలరేగిపోయిన అతడు.. ఏకధాటిగా షాట్లు ఆడుతున్నాడు. అందుకే.. 10 ఓవర్లలోనే సీఎస్కే 9.7 రన్ రేట్‌తో 97 పరుగులు చేయగలిగింది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. మహమ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హసరంగా 2 ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

RCB vs CSK: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే

Exit mobile version