CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్‌పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. టీమిండియా మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ సీఎస్కే తదుపరి హెడ్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్కే మేనేజ్మెంట్ కొత్త కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ విషయంలో ధోనీ రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సీఎస్కే సపోర్ట్ స్టాఫ్‌ను భారతీయుల నేతృత్వంలో నడిపించాలని మహీ సూచించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే హేమంగ్ బదానీకి అవకాశాలు మరింత మెరుగవుతాయని సదరు నివేదిక పేర్కొంది.
Also Read
- NZ vs IND 4th ODI: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
- IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
- IPL 2027-KKR: కొత్త కెప్టెన్‌గా విండీస్ స్టార్.. కేకేఆర్‌కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
- Pat Cummins: "నాకు అస్సలు తెలియదు".. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
ఐపీఎల్లో కోచింగ్ అనుభవంతో పాటు విదేశీ టీ20 లీగ్‌లలోనూ హేమంగ్ బదానీకి మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం కలిగి ఉన్న బదానీ.. ది హండ్రెడ్‌లో సదర్న్ బ్రేవ్, ILT20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే సియాటిల్ ఆర్కాస్‌కు కన్సల్టెంట్‌గా కూడా పనిచేస్తున్నాడు. విదేశీ లీగ్‌లలో అతడి అనుభవం సీఎస్కేకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఎంఎస్ ధోనీ చేసిన మరో కీలక ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎస్కే కొత్త హెడ్ కోచ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇతర టీ20 ఫ్రాంచైజీలతో ఏకకాలంలో కోచింగ్ బాధ్యతలు నిర్వహించే విధానానికి ముగింపు పలకాలని ధోనీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో సీఎస్కేతో పాటు SA20లో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఇకపై సీఎస్కే కోచ్‌కు ఇతర ఫ్రాంచైజీల బాధ్యతలు ఉండకూడదన్నది ధోనీ ప్రతిపాదనగా ఆ నివేదిక పేర్కొంది.
2023లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్కే.. ఆ తర్వాత వరుసగా నిరాశపరుస్తోంది. 2026 సీజన్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నచెన్నై.. గత మూడు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికపై సీఎస్కే తీసుకునే నిర్ణయం జట్టు భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ప్రస్తుతం హేమంగ్ బదానీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సీఎస్కే హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారో.
తాజావార్తలు
-
NZ vs IND 4th ODI: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
-
AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!