NTV Telugu Site icon

Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్

Cricketer Vasant Rathod

Cricketer Vasant Rathod

Cricketer Vasanth Rathod Dies Of Heart Attack While Playing Cricket In Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ.. ఓ క్రికెటర్ మైదానంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) ఫీల్డింగ్ చేస్తూ గ్రౌండ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతని ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి

ఈ ఘటనపై జీఎస్టీ విభాగం సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఆ మ్యాచ్‌లో వసంత్ మొదట్లో చాలా యాక్టివ్‌గానే కనిపించాడు. బౌలింగ్ వేసే సమయంలోనూ బాగానే ఉన్నాడు. అయితే.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, అతడు కింద పడిపోయాడు. ఏం జరిగిందోనని మేమంతా ఆందోళన చెందాం. మొదట్లో స్పృహ కోల్పోయి పడిపోయాడేమోనని భావించాం. ఎలాంటి కదలికలు లేకపోవడంతో సహచరులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆలోపే అతడు మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు’’ అని చెప్పుకొచ్చారు. అతని మృతితో తమను కలచివేసిందని పేర్కొన్నారు. కాగా.. జీఎస్టీ విభాగంలో వసంత్ సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు.. గుజరాత్‌లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రాజ్కోట్‌లో ప్రశాంత్ భరోలియా(27), సూరత్‌లో జిగ్నేష్ చౌహాన్(31) అనే క్రికెటర్లు సైతం మైదానంలోనే గుండెపోటుతో మరణించారు.

Delhi Crime News: కుక్కపై అత్యాచారం.. కెమెరాకి చిక్కిన నిందితుడు