Site icon NTV Telugu

Vaibhav Suryavanshi : తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav

Vaibhav

Vaibhav Suryavanshi :ఐపీఎల్ లోనే అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేసిన వైభవ్.. తొలి మ్యాచ్ లో కూడా అదరగొట్టేశాడు. 14 ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్ లోకి అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ రోజు తన తొలి మ్యాచ్ ను ఆడాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్.. ఈ రోజు లక్నో తో జరుగుతున్న మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్ కొట్టేసి ఔరా అనిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 20 బంతుల్లో 34 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
Read Also : L2 Empuraan : ఎల్-2 ఎంపురాన్ మరో రికార్డు

20 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్ల తో 34 రన్స్ చేసిన వైభవ్ ఔట్ అయ్యాడు. ఇంకొద్ది సేపు గ్రౌండ్ లో ఉంటే మరిన్ని పరుగులు చేసేవాడు కాబోలు. కానీ ఫస్ట్ మ్యాచ్ లోనే.. ఇంత చిన్న వయసులో కూడా తడబడకుండా ఆడటంతో అందరూ వైభవ్ ఆటను ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్ లో తనకు వచ్చిన అవకాశాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకున్నాడు. కాబట్టి ఇతన్ని మరిన్ని మ్యాచ్ లలో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version