Site icon NTV Telugu

Cricketer Became Rickshaw Driver: రిక్షావాలాగా మారిన క్రికెటర్..

Cricketer

Cricketer

Cricketer Became Rickshaw Driver: కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొందరికి పూటగడవడమే కష్టంగా మారింది. జాతీయ టోర్నమెంట్లలో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుది కూడా అదే పరిస్థితి. రాజబాబు అనే విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ ఇప్పుడు ఘజియాబాద్‌లో ఇ-రిక్షా నడుపుతూ పాలు అమ్ముతున్నాడు.

2017 జాతీయ పోటీలో ఉత్తరప్రదేశ్ తరపున ఢిల్లీపై 20 బంతుల్లో 67 పరుగులు చేసి ఈ క్రికెటర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. మీరట్‌లో జరిగిన ‘హౌసలోన్‌ కి ఉడాన్‌’ పోటీలో 50 పరుగుల చురుకైన ప్రదర్శన చేసి రాజబాబు అనేక ప్రశంసలు అందుకున్నాడు. ఆయన భవిష్యత్ మంచి స్థాయికి వెళ్తాడని చాలా మంది ప్రశంసించారు. ఒక స్థానిక వ్యాపారవేత్త ముందుకు వచ్చి బ్యాట్స్‌మన్‌కి ఇ-రిక్షా కూడా ఇచ్చాడు. రాజబాబు ఇప్పుడు ఘజియాబాద్‌లో దాని ఆధారంగానే జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొంది.

Asia Cup 2022: అబుదాబిలో ఆసియా కప్ 2022 ట్రోఫీ ఆవిష్కరణ

దురదృష్టవశాత్త ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన జీవితంలో ఎదగాలనే సమయంలో కొవిడ్ రాజబాబు కెరీర్‌ను నాశనం చేసింది. ఆర్థిక సంక్షోభం కారణంగా దివ్యాంగ్ క్రికెట్ అసోసియేషన్ (DCA) రాష్ట్రంలోని వికలాంగ క్రికెటర్లకు సహాయం చేసే లాభాపేక్ష రహిత సంస్థ 2020లో కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రాజబాబు వంటి ఆటగాళ్లు ఉనికిలోకి రాకుండా ఉన్నారు.

“ఈ నిర్ణయంతో నిజంగా మా వెన్ను విరిగింది. మొదటి కొన్ని నెలలు, నేను ఘజియాబాద్ వీధుల్లో పాలు విక్రయించాను. ఇ-రిక్షాను నడిపాను” అని రాజబాబు అన్నారు. తన సహచరులు మీరట్‌లోని వికలాంగుల దాబాలో డెలివరీ ఏజెంట్లుగా, వెయిటర్‌లుగా పని చేసేవారని వెల్లడించాడు. దీనిని దివ్యాంగ్ క్రికెట్ అసోసియేషన్, కోచ్ అయిన అమిత్ శర్మ ప్రారంభించారని తెలిపాడు. అతని భార్య నిధి (27), పిల్లలు కృష్ణ (7), షాన్వి (2), సహా నలుగురితో కూడిన అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం ఘజియాబాద్ వీధుల్లో బహుమతిగా ఇ-రిక్షా నడుపుతూ రూ. 250–300 సంపాదిస్తున్నాడు.

Exit mobile version