Site icon NTV Telugu

Crescent Cricket Cup: టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్.. హైదరాబాద్‌ వేదికగా సినీస్టార్ట్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌

Ccc

Ccc

Crescent Cricket Cup: ప్రతి ఏడాది హైదరాబాద్‌లో సినీ తారల క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ‘క్రెసెంట్ క్రికెట్ కప్’ (సీసీసీ) ఫిబ్రవరి 26న ఎల్బీ స్టేడియంలో వేదికగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు తలపడే ఈ పోటీల్లో ఈ ఏడాది ‘సే నో టు డ్రగ్స్’ అనే అంశంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హోంమంత్రి మహమూద్‌ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌.. క్రికెట్‌ కప్‌, పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

Read Also: Spotify: టెక్ లేఆఫ్ జాబితాలోకి మరో కంపెనీ.. ఉద్యోగుల తొలగించే యోచనలో స్పాటిఫై

ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, పోటీల నిర్వాహకులు షకీల్ సఫీ మాట్లాడుతూ.. మ్యాచ్‌ పూర్తిగా ఉచితమని, తిలకించేందుకు ఆసక్తి గల వారు సీసీసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని పాస్‌లను పొందవచ్చు అని వెల్లడించారు.. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ టీమ్ కెప్టెన్ అర్బాజ్ ఖాన్, బిగ్ బాస్ 6 విజేత రేవంత్, తెలుగు నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీష్, ఖయ్యూమ్, రవి ప్రకాష్, శ్రవణ్, వీజే సన్నీ, షఫీ, అమిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారీ ఈ క్రికెట్ పోటీల్లో టాలీవుడ్ కు చెందిన పలువురు యువ హీరోలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్టార్ క్రికెట్ పోటీల్లో అఖిల్, శ్రీకాంత్, నవదీప్, తరుణ్ పాల్గొని అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉందన్నారు. సీసీసీ టీమ్ సభ్యులను ఆయన అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఎమ్మెల్యే బాలరాజు, అర్బాజ్ ఖాన్, హోంమంత్రి విన్నర్‌, రన్నర్‌ కప్‌లను లాంచ్‌ చేశారు.

Exit mobile version