పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియాలో బెట్టింగ్ వేస్తున్నారు. అయితే హైదరాబాద్ బాచుపల్లిలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. పాకిస్థాన్ లీగ్ కోసం ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తుంది. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన మదాపూర్ పోలీసులు వీరి వద్ద నుండి 21 లక్షల రూపాయలు అలాగే 33 ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన పై మాట్లాడిన సీపీ సజ్జనార్… చాలా మంది యూత్ ఈ బెట్టింగ్స్ లో పాల్గొని నష్టపోతున్నారు అని తెలిపారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు.
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియాలో బెట్టింగ్…
