ఉగాండా ఒలింపిక్ బృందం జపాన్‌కు చేరుకుంది. వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
ఒలింపిక్ లో మొదలైన కరోనా కలకలం…
