కొత్త కరోనా వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి సౌత్ ఆఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో పోటీ పడనుంది. కానీ ఇప్పుడు ఈ పర్యటన పై కరోనా నీడలు కాముకున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపాంతరం చెందిన తర్వాత తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అంధాత్రిని అప్రమత్తం చేసింది. అయితే కొత్తగా గుర్తించబడిన ఈ వేరియంట్ గురించి WHO సమావేశం నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. కానీ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20ల కోసం భారత్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన డిసెంబర్ 17న ప్రారంభం కానుంది. కానీ ప్రస్తుతం ఆదేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ పర్యటన గతంలో జరగాల్సిందే.. కానీ అప్పుడు కూడా దీనిని కరోనానే వాయిదా వేసింది.
భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకి కరోనా ముప్పు…?
